Pakistan: లోదుస్తుల విషయంలోనూ డ్రెస్‌కోడ్ పాటించాలన్న పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్.. విమర్శలతో యూటర్న్!

Pakistan international Airlines orders Wear Underwear Dress Code and then took Uturn
  • సరైన వస్త్రధారణ లేకపోవడం వల్ల సంస్థపై వ్యతిరేక ప్రభావం పడుతోందన్న పీఐఏ
  • లో దుస్తుల విషయంలో సిబ్బంది డ్రెస్ కోడ్ పాటించాలని ఆదేశాలు
  • దుమ్మెత్తి పోసిన సోషల్ మీడియా
  • వెనక్కి తగ్గి క్షమాపణలు కోరిన పీఐఏ
లో దుస్తుల విషయంలోనూ డ్రెస్ కోడ్ పాటించాలన్న పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) చివరికి క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. గురువారం ఈ ఆదేశాలు జారీ చేసిన పీఐఏ శుక్రవారం పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కోరింది. సిబ్బందికి సరైన వస్త్రధారణ లేకపోవడం వల్ల వ్యక్తిగతంగానే కాకుండా ఆ ప్రభావం ఎయిర్‌లైన్స్ పైనా పడుతోందని పేర్కొన్న సంస్థ.. లో దుస్తుల విషయంలోనూ డ్రెస్ కోడ్ పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. 

పీఐఏ ఆదేశాలపై సర్వత్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియా అయితే దుమ్మెత్తి పోసింది. లోదుస్తుల విషయంలో డ్రెస్‌కోడ్ ఏంటంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెనక్కి తగ్గి పీఐఏ.. తమ ఉద్దేశం అది కాదని, సరైన వస్త్రధారణతో విధులకు హాజరు కావాలన్నదే తమ అభిమతమని పేర్కొంది. అయితే, భావాన్ని వ్యక్తీకరించే క్రమంలో తప్పు జరిగిందని పీఐఏ చీఫ్ హెచ్ఆర్ ఒకరు వివరణ ఇచ్చారు. వాడిన పదాలు సరిగా లేవని అన్నారు. సిబ్బంది మనసుల్ని నొప్పించినందుకు క్షమించాలన్నారు. సంస్థ పరువుకు భంగం వాటిల్లేలా కొందరు ఈ అంశాన్ని ట్రోల్ చేయడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Pakistan
PIA
Pakistan Intenational Airlines
Dress Code

More Telugu News