KCR: యాదాద్రి ఆలయంలో కేసీఆర్‌ కుటుంబం.. కేజీ 16 తులాల బంగారం విరాళం

  • సతీసమేతంగా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న కేసీఆర్
  • విమాన గోపురం బంగారు తాపడం కోసం బంగారం విరాళం
  • విరాళాన్ని అందజేసిన మనవడు హిమాన్షు
KCT donates gold to Yadadri

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన అర్ధాంగి శోభ దర్శించుకున్నారు. కేసీఆర్ మనవడు, కేటీఆర్ కుమారుడు హిమాన్షు కూడా వీరితో పాటు ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం కోసం ఒక కేజీ 16 తులాల బంగారాన్ని విరాళంగా అందించారు. ఈ విరాళాన్ని హిమాన్షు అందజేశారు. స్వామి వారి దర్శనానంతరం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను ఆలయ అర్చకులు ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెంట మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ దామోదర్ రావు, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, గొంగిడి సునీత, సుధీర్ రెడ్డి, జీవన్ రెడ్డి తదితరులు ఉన్నారు. స్వామి వారి దర్శనానికి ముందు యాదాద్రి కొండ దిగువన ఉన్న ప్రెసిడెన్సియల్ సూట్ లో వైటీడీఏ అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సత్యనారాయణ వ్రత మండపం, గండి చెరువు ఆధునికీకరించే పనులు, వాటి పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

More Telugu News