Telangana: ఏపీ భ‌వ‌న్‌లో అధికారిని హ‌రీశ్ రావు ఎలా త‌న్నారో అంద‌రూ చూశారు: ఏపీ మంత్రి అమ‌ర్‌నాథ్‌

ap minister gudivada amarnath fires on ts minister harish rao comments
  • 8 ఏళ్ల‌లో కేసీఆర్ తెలంగాణ‌కు ఏం చేశార‌న్న అమ‌ర్‌నాథ్
  • హ‌రీశ్, కేసీఆర్‌ల మ‌ధ్య గొడ‌వ‌లు ఉంటే వాళ్లే చూసుకోవాల‌ని వ్యాఖ్య‌
  • ఏపీపై తెలంగాణ నేత‌ల విమ‌ర్శ‌లు స‌రికాద‌ని హిత‌వు
ఉపాధ్యాయుల ప‌ట్ల ఏపీ ప్ర‌భుత్వం క‌ర్క‌శంగా వ్య‌వ‌హ‌రిస్తోందంటూ తెలంగాణ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏపీ నుంచి వ‌రుస‌గా కౌంట‌ర్లు ప‌డుతున్నాయి. హ‌రీశ్ రావు వ్యాఖ్య‌ల‌పై గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ స్పందించిన విష‌యం తెలిసిందే. తాజాగా శుక్ర‌వారం ఏపీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ స్పందించారు. ఏపీపై తెలంగాణకు చెందిన నేత‌ల విమ‌ర్శ‌లు స‌రికాద‌ని ఆయ‌న అన్నారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆ రాష్ట్ర మంత్రి హ‌రీశ్ రావు‌ల‌ను చూసి తాము నేర్చుకోవాల్సింది ఏమీ లేద‌ని అమ‌ర్‌నాథ్ అన్నారు. గ‌డ‌చిన మూడేళ్ల‌లోనే ఏపీకి త‌మ ప్ర‌భుత్వం ఏం చేసిందో ప్ర‌జ‌ల‌కు తెలుసున‌ని కూడా ఆయ‌న అన్నారు. 8 ఏళ్ల‌లో సీఎంగా ఉన్న కేసీఆర్ తెలంగాణ‌కు ఏం చేశారో చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఏపీ భ‌వ‌న్‌లో అధికారిని హ‌రీశ్ రావు ఎలా త‌న్నారో అంద‌రూ చూశార‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. హ‌రీశ్ రావు, కేసీఆర్‌ల మ‌ధ్య గొడ‌వ‌లు ఉంటే వాళ్లే చూసుకోవాల‌ని కూడా అమ‌ర్‌నాథ్ వ్యాఖ్యానించారు.
Telangana
Andhra Pradesh
Gudivada Amarnath
Harish Rao
TRS
YSRCP

More Telugu News