ఏపీలో జనసేనతో తప్ప మరే పార్టీతోనూ మాకు పొత్తు లేదు: బీజేపీ నేత లక్ష్మణ్

  • తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులపై లక్ష్మణ్ స్పందన
  • టీడీపీతో పొత్తు ఆలోచనే లేదని స్పష్టీకరణ
  • ఏపీలో బీజేపీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడి
  • కేసీఆర్ జాతీయ పార్టీని స్వాగతిస్తున్నామని వ్యాఖ్యలు
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు, బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ స్పందించారు. ఏపీలో తమకు జనసేన పార్టీతో తప్ప మరే ఇతర పార్టీతో పొత్తు లేదని స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తు ఆలోచనే లేదన్నారు. ఏపీలో అభివృద్ధి జరగడం లేదని, బీజేపీ అధికారంలోకి రావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. 

తెలంగాణలోనూ బీజేపీదే అధికారం అని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీపైనా లక్ష్మణ్ అభిప్రాయాలు పంచుకున్నారు. కేసీఆర్ కొత్త పార్టీని స్వాగతిస్తున్నామని తెలిపారు. హైదరాబాదులో మీడియాతో ముచ్చటిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Laxman
BJP
Andhra Pradesh
Janasena
TDP
Telangana
KCR

More Telugu News