Kalyanamastu: ఏపీలో కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలకు ఎవరు అర్హులంటే...!

AP Govt brings Kalyanamastu and Shaadi Tofa
  • ఏపీలో పేద ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం పథకాలు
  • అర్హులకు ఆర్థికసాయం
  • అక్టోబరు 1 నుంచి పథకాల అమలు
  • ప్రారంభించనున్న సీఎం జగన్
రాష్ట్రంలోని పేద ఆడపిల్లల వివాహాలకు చేయూతనిచ్చే విధంగా ఏపీ ప్రభుత్వం కల్యాణమస్తు, షాదీ తోఫా పేరుతో పథకాలను తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కల్యాణమస్తు, ముస్లిం మైనారిటీల కోసం షాదీ తోఫా అమలు చేయనున్నారు. ఈ పథకాలను సీఎం జగన్ రేపు (అక్టోబరు 1) ప్రారంభించనున్నారు. 

ఈ పథకాల వివరాలు ఇవిగో...

  • వధువు వయసు 18, వరుడి వయసు 21 నిండాలి. 
  • ఇరువురికి టెన్త్ క్లాస్ ఉత్తీర్ణత తప్పనిసరి. 
  • నెలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.10 వేలు, పట్టణాల్లో అయితే రూ.12 వేలు మించరాదు. 
  • నెలసరి విద్యుత్ వాడకం 300 యూనిట్లకు మించకూడదు. 
  • వారి కుటుంబాల్లో ఆదాయపన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఉండరాదు. 
  • వధూవరుల ఇద్దరి కుటుంబ సభ్యుల వివరాలను పరిగణనలోకి తీసుకుంటారు. 
  • కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలకు 6 దశల్లో తనిఖీలు ఉంటాయి. 
  • ఎస్సీ, ఎస్టీ వధూవరులకు రూ.1 లక్ష, బీసీలకు రూ.50 వేలు, మైనారిటీలకు రూ.1 లక్ష ఇస్తారు. 
  • ఎస్సీ, ఎస్టీలు కులాంతర వివాహం చేసుకుంటే రూ.1.20 లక్షలు, బీసీలు కులాంతర వివాహం చేసుకుంటే రూ.75 వేలు, దివ్యాంగులకు రూ.1.50 లక్షలు, భవన నిర్మాణ కార్మికులకు రూ.40 వేలు అందిస్తారు. 

Kalyanamastu
Shaadi Tofa
CM Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News