Flax seeds: అవిసె గింజలు చేసే మేలు ఎంతో..!

  • వీటిల్లో ప్రత్యేకమైన ఫైబర్
  • పుష్కలంగా ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్
  • వీటితో గుండె ఆరోగ్యానికి, పేగుల ఆరోగ్యానికీ మేలు
  • మహిళల రుతుచక్ర క్రమబద్ధీకరణ నైపుణ్యాలు
66 health benefits of Flaxseeds

అవిసె గింజలు తినడానికి అంత సౌకర్యంగా అనిపించవు. అందుకే ఎక్కువ మంది వీటికి దూరంగా ఉంటుంటారు. ఫ్లాక్స్ సీడ్ గా పిలిచే వీటిని.. మంచి ఆరోగ్యం కోరుకునే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. వీటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఫ్లాక్స్ సీడ్స్ మెరుస్తూ కనిపిస్తాయి. పట్టుకుంటే పట్టులా జారిపోయేలా ఉంటాయి. దీన్ని సూపర్ ఫుడ్ గా చెబుతుంటారు. 

కొలెస్ట్రాల్
ఫ్లాక్స్ సీడ్స్ లో సాల్యుబుల్ ముసిలాగినోస్ (గమ్ లాంటి పదార్థం) ఉంటుంది. ఇది ఒక రకం ఫైబర్. గుండెకు చేటు చేసే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ నియంత్రణకు, రక్తంలో షుగర్ స్థాయులను నియంత్రణలో ఉంచుతుంది.

రుతుక్రమం
మహిళలకు అవిసె గింజలు మరింత మేలు చేస్తాయి. వీటిని రోజువారీగా తినడం వల్ల మెనోపాజ్ లక్షణాలను ఆలస్యం చేస్తుంది. రుతుక్రమాన్ని క్రమబద్ధీకరించే సుగుణాలు కూడా ఉన్నాయి. 

బరువు తగ్గొచ్చు..
స్నాక్స్ కు బదులు ఫ్లాక్స్ సీడ్స్ కొన్ని తిని చూడండి. తేడా ఏంటో మీకే తెలుస్తుంది.  దీనిలో పుష్కలమైన ఫైబర్ ఉండడం వల్ల వెంటనే ఆకలి అనిపించదు. తినడం కూడా తక్కువే తింటారు. దీనివల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.

గుండె ఆరోగ్యం
అవిసె గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి రక్తంలో ట్రై గ్లిజరైడ్స్ ను తగ్గిస్తాయి. దీంతో స్ట్రోక్, హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో ఇది సాయపడుతుంది. 

కళ్లకూ మంచిదే
ఇందులో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కళ్లల్లోని నరాల పటిష్ఠతకు సాయపడతాయి. దీంతో కంటి చూపు ఆరోగ్యకరంగా ఉంటుంది. 

పేగుల ఆరోగ్యం
ఫ్లాక్స్ సీడ్స్ లోని ఫైబర్ పేగుల ఆరోగ్యానికి కూడా సాయపడుతుంది. మంచి బ్యాక్టీరియా వృద్ధికి ఇది దోహదపడుతుంది. దీంతో మలబద్ధకం సమస్యలు ఉంటే తగ్గిపోతాయి.

More Telugu News