YSRTP: నేడు వైఎస్సార్‌ బతికే ఉంటే కాంగ్రెస్ పై ఉమ్మేవారు: ష‌ర్మిల‌

  • ప్ర‌జా ప్ర‌స్థానంలో న‌ర్సాపూర్‌లో మాట్లాడిన ష‌ర్మిల‌
  • కాంగ్రెస్‌ను రాష్ట్రంలో రెండు సార్లు వైఎస్సార్ అధికారంలోకి తెచ్చార‌ని వెల్ల‌డి
  • కేంద్రంలోనూ పార్టీ అధికారంలోకి వ‌చ్చేలా వైఎస్సార్ చేశార‌న్న వైఎస్సార్టీపీ అధినేత్రి
ys sharmila fires on congress party

కాంగ్రెస్ పార్టీపై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల గురువారం తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి నేడు బ‌తికే ఉంటే కాంగ్రెస్‌పై ఉమ్మేవారంటూ ఆమె వ్యాఖ్యానించారు. ప్రజా ప్ర‌స్థానం యాత్రలో భాగంగా సంగారెడ్డి జిల్లా న‌ర్సాపూర్‌లో మాట్లాడిన ఆమె కాంగ్రెస్‌పై విరుచుకుప‌డ్డారు. 30 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో కొన‌సాగిన వైఎస్ రాజ‌శేఖ‌రెడ్డి రెండు సార్లు పార్టీని ఉమ్మ‌డి రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చార‌ని, కేంద్రంలోనూ పార్టీ అధికారంలోకి వ‌చ్చేలా చేశార‌ని అన్నారు.

అయితే రాజ‌శేఖ‌రెడ్డి చ‌నిపోగానే... ఆయ‌న పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చిన కాంగ్రెస్ పార్టీ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి వెన్నుపోటు పొడిచింద‌ని ష‌ర్మిల అన్నారు. హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో రాజ‌శేఖ‌ర‌రెడ్డి చ‌నిపోతే... ఆ ఘ‌ట‌న‌పై కాంగ్రెస్ పార్టీ క‌నీసం విచార‌ణ కూడా చేయించ‌లేద‌ని ఆరోపించారు. బ‌తికుండ‌గానే రాజ‌శేఖ‌ర‌రెడ్డిని పొగిడిన కాంగ్రెస్ పార్టీ ఆయ‌న చ‌నిపోగానే నింద‌లు వేసింద‌ని ఆమె ఆరోపించారు. నింద‌లు వేసిన రాజ‌శేఖ‌ర‌రెడ్డి బొమ్మ‌ను పెట్టుకుని కాంగ్రెస్ నేత‌లు ఇప్పుడు ఓట్లు అడుగుతున్నార‌ని ఆమె మండిప‌డ్డారు.

More Telugu News