Krishnam Raju: కృష్ణంరాజు సంస్మరణ సభకు హాజరైన ఏపీ మంత్రులు.. స్మృతివనం ఏర్పాటుకు రెండెకరాలు ఇస్తామని ప్రకటన

  • మొగల్తూరులో జరిగిన కృష్ణంరాజు సంస్మరణ సభ
  • పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు
  • ప్రభుత్వం తరపున వచ్చిన మంత్రులు రోజా, కారుమూరి
Will give 2 acres land to Krishnam Raju smruthi vanam says minister Karumuri

రెబెల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభ మొగల్తూరుతో జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో ప్రభాస్ వచ్చారు. ఏపీ ప్రభుత్వం తరపున మంత్రులు రోజా, కారుమూరు నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ... కృష్ణంరాజు మరణంతో రాష్ట్ర ప్రజలందరూ దిగ్భ్రాంతికి గురయ్యారని అన్నారు. ఆయన మరణం సినీ, రాజకీయ రంగాలకు తీరని లోటు అని చెప్పారు. కృష్ణంరాజు స్మృతివనం ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తుందని... రెండెకరాల స్థలాన్ని కేటాయిస్తుందని... ఇదే విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలిపామని వెల్లడించారు. 

ఈ కార్యక్రమానికి టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కూడా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, ప్రజల హృదయాల్లో కృష్ణంరాజు చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పారు. రాజకీయ నాయకుడిగా కూడా గొప్ప పేరు తెచ్చుకున్నారని... చిన్న అవినీతి మరక కూడా లేని నాయకుడిగా తనదైన ముద్ర వేసుకున్నారని కొనియాడారు. కృష్ణంరాజు ఆశయాల సాధనకు కృషి చేస్తామని చెప్పారు.

More Telugu News