8800 కి.మీ ప్రయాణించి, 45 ఏళ్ల తర్వాత బామ్మను వెతికిన మనవడు... వీడియో వైరల్
- స్పెయిన్ నుంచి బొలీవియా వచ్చిన వ్యక్తి
- బామ్మను కలవగానే ఇరువురి భావోద్వేగం
- తన ప్రయాణం మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన మనవడు
ఈ వీడియోను గుడ్‌న్యూస్ మూవ్‌మెంట్ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేయడంతో ప్రపంచానికి తెలిసింది. "45 సంవత్సరాల తర్వాత, ఈ వ్యక్తి తన బామ్మ అనాను కనుగొన్నాడు. చిన్నతనంలో అతడిని ఆమె తన సొంత కొడుకులా చూసుకున్న అపురూపమైన మహిళ' అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. పసిబిడ్డగా ఉన్నప్పుడు బామ్మ చూపెట్టిన ప్రేమే అతడిని ఇంతదూరం తీసుకొచ్చింది అని అభిప్రాయపడింది. ఈ వీడియో చూసిన వాళ్లంతా తమ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. “ఇది చాలా అందంగా ఉంది. మా అక్కాచెల్లెళ్లు, నేను మా బామ్మను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాము, కానీ మాకు ఇంకా అదృష్టం కలిసి రాలేదు" అని ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు.