Atchannaidu: దద్దమ్మల్లారా.. అభివృద్ధి చేస్తే వద్దని ఎవరంటున్నారు?: అచ్చెన్నాయుడు

Who stopped you in developing north andhra asks Atchannaidu
  • ప్రజలను మభ్యపెట్టడానికి మూడు రాజధానులు అంటున్నారన్న అచ్చెన్న 
  • ఉత్తరాంధ్రకు వైసీపీ ప్రభుత్వం చేసిందేమిటని ప్రశ్న 
  • ఉత్తరాంధ్ర భూములను కొట్టేయడానికి డ్రామాలు ఆడుతున్నారని విమర్శ 
అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవడానికి ఐదు నిమిషాలు చాలు అన్న మంత్రి బొత్సపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాష్ట్రమేమైనా నీ జాగీరా? అని ప్రశ్నించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు వారి హక్కుల కోసం పాదయాత్రలు చేస్తుంటే మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. 

ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయొద్దా? అని వైసీపీ నేతలు అంటున్నారని... దద్దమ్మల్లారా అభివృద్ధి చేస్తే వద్దని ఎవరంటున్నారని అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వద్దంటున్నాడా? అచ్చెన్నాయుడు వద్దంటున్నాడా? ఉత్తరాంధ్ర ప్రజలు వద్దంటున్నారా? ఎవరు వద్దంటున్నారని ప్రశ్నించారు. 

ప్రజలను మభ్యపెట్టడానికి, తప్పుదోవ పట్టించేందుకు మూడు రాజధానులు అంటున్నారని... ఈ మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్రకు చేసిందేమిటని అడిగారు. ఏమీ చేయకపోగా... ఉన్న అభివృద్ధిని కూడా నాశనం చేశారని మండిపడ్డారు. ప్రకృతి ఇచ్చిన రుషికొండను కాజేస్తున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర భూములను కొట్టేయడానికే డ్రామాలు ఆడుతున్నారని అన్నారు.
Atchannaidu
Chandrababu
Telugudesam
Jagan
YSRCP

More Telugu News