వయసు 73.. అనుభవం 45.. సీఎంగా 14.. కుప్పంలో ఓటు లేదు: మంత్రి రోజా వ్యంగ్యం
- చంద్రబాబుపై మంత్రి రోజా సెటైరిక్ ట్వీట్
- కుప్పంలో చంద్రబాబుకు ఇల్లు కూడా లేదని ఆరోపణ
- చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే ఒక్క స్కీమూ లేదని ఎద్దేవా
వయసు 73. అనుభవం 45. సీఎంగా 14. కుప్పంలో ఓటు లేదు. ఇల్లు కూడా లేదు. ఆయన పేరు చెపితే గుర్తుకు వచ్చే స్కీము లేదు! వాటే పిటీ బాబూ...? అని రోజా తన ట్వీట్లో పేర్కొన్నారు. ఏళ్ల తరబడి కుప్పం నుంచి గెలుస్తూ వస్తున్న చంద్రబాబుకు ఓటు హక్కుతో పాటు కుప్పంలో సొంతిల్లు కూడా లేని వైనాన్ని ఆమె ప్రస్తావించారు.