రాజకీయ చదరంగంలో 'గాడ్ ఫాదర్'
- 'గాడ్ ఫాదర్' గా వస్తున్న చిరంజీవి
- అవినీతి రాజకీయాల నేపథ్యంలో నడిచే కథ
- దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్
- సెన్సార్ నుంచి U/A సర్టిఫికెట్
రాజకీయ జీవితం ఒక చదరంగం వంటిది.. ఎత్తులు పై ఎత్తులు సరిగ్గా వేయకపోతే, శత్రువుల చేతికి చిక్కిపోయినట్టే. అలాంటి రాజకీయాలను ఒక 'గాడ్ ఫాదర్' ఎలా శాసించడనేదే కథ. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ మరింత ఊపందుకున్నాయి.
చిరంజీవి వైపు నుంచి వదులుతున్న పోస్టర్లు ఒక్కొక్కటి అంచనాలు పెంచుతూ వెళుతున్నాయి. చదరంగం మధ్యలో నుంచి ఆయన రాజసంతో నడిచి వచ్చే పోస్టర్ కి అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా, U/A సర్టిఫికెట్ ను పొందింది. ఈ సినిమా సరికొత్త సంచలనానికి తెరతీస్తుందేమో చూడాలి