Chiranjeevi: రాజకీయ చదరంగంలో 'గాడ్ ఫాదర్'

  • 'గాడ్ ఫాదర్' గా వస్తున్న చిరంజీవి
  • అవినీతి రాజకీయాల నేపథ్యంలో నడిచే కథ
  • దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్
  • సెన్సార్ నుంచి U/A సర్టిఫికెట్
God Father movie upadate

చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు మోహన్ రాజా 'గాడ్ ఫాదర్' సినిమాను రూపొందించాడు. మలయాళంలో ఆ మధ్య వచ్చిన 'లూసిఫర్'కి ఇది రీమేక్. ఎన్వీ ప్రసాద్ - ఆర్ బి చౌదరి ఈ సినిమాను నిర్మించారు. అవినీతి రాజకీయాలు .. అన్యాయంగా ఎదగడానికి అవలంబించే మార్గాల చుట్టూ ఈ కథ తిరగనుంది. 

రాజకీయ జీవితం ఒక చదరంగం వంటిది.. ఎత్తులు పై ఎత్తులు సరిగ్గా వేయకపోతే, శత్రువుల చేతికి చిక్కిపోయినట్టే. అలాంటి రాజకీయాలను ఒక 'గాడ్ ఫాదర్' ఎలా శాసించడనేదే కథ. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ మరింత ఊపందుకున్నాయి. 

చిరంజీవి వైపు నుంచి వదులుతున్న పోస్టర్లు ఒక్కొక్కటి అంచనాలు పెంచుతూ వెళుతున్నాయి. చదరంగం మధ్యలో నుంచి ఆయన రాజసంతో నడిచి వచ్చే పోస్టర్ కి అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా, U/A సర్టిఫికెట్ ను పొందింది. ఈ సినిమా సరికొత్త సంచలనానికి తెరతీస్తుందేమో చూడాలి

More Telugu News