పాన్ ఇండియా లెవెల్లో తిరుగులేని సమంత.. బాలీవుడ్ బ్యూటీలంతా ఆమె తర్వాతే!
- మోస్ట్ పాప్యులర్ ఫిమేల్ స్టార్స్ జాబితా విడుదల చేసిన ఓర్ మ్యాక్స్ సంస్థ
- అగ్ర స్థానంలో సమంత.. రెండో స్థానంలో అలియాభట్
- ఐదో స్థానంలో దీపికా పదుకొణే
ఈ క్రమంలో పాన్ ఇండియా లెవెల్లో మోస్ట్ పాప్యులర్ ఫిమేల్ స్టార్స్ టాప్ టెన్ జాబితాలో సమంత తొలి స్థానాన్ని ఆక్రమించింది. మిగిలిన స్టార్ హీరోయిన్లు అందరినీ ఆమె వెనక్కి నెట్టేసింది. ఓర్ మ్యాక్స్ సంస్థ వెల్లడించిన అత్యంత పాప్యులర్ పాన్ ఇండియా హీరోయిన్ల సర్వేలో టాప్ పొజిషన్ లో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా అలియాభట్, నయనతార, కాజల్ అగర్వాల్, దీపికా పదుకొణే, రష్మిక మందన్న, కీర్తి సురేశ్, కత్రినా కైఫ్, పూజా హెగ్డే, అనుష్క శెట్టి ఉన్నారు.