Karumuri Nageswara Rao: హెల్త్ యూనివర్శిటీకీ వైఎస్సార్ పేరు పెట్టడానికి కారణం ఇదే: ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

  • ఆరోగ్యశ్రీ అంటేనే అందరికీ వైఎస్సార్ గుర్తుకొస్తారన్న మంత్రి 
  • వైద్య రంగంలో వైఎస్సార్ విశేషమైన కృషి చేశారన్న కారుమూరి  
  • హెల్త్ యూనివర్శిటీకి వైఎస్సార్ పేరు పెట్టాలని చాలా మంది కోరారని వెల్లడి 
Minister Karumuri response on NTR name removal

హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్సార్ పేరును పెట్టడంపై ఏపీలో విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కారుమూరి స్పందిస్తూ... ఎన్టీఆర్ అంటే తమ పార్టీకి ఎంతో గౌరవమని, ఆయనను ఉన్నతంగానే చూస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీ అంటేనే అందరికీ వైఎస్సార్ గుర్తుకొస్తారని... అందుకే హెల్త్ యూనివర్శిటీకి వైఎస్సార్ పేరు పెట్టామని తెలిపారు. 

తణుకులో బీసీ కమ్యూనిటీ హాలుకు జ్యోతిరావు పూలే పేరు ఉంటే... టీడీపీ హయాంలో ఆ పేరును మార్చి ఎన్టీఆర్ పేరు పెట్టారని అన్నారు. వైద్య రంగంలో వైఎస్సార్ విశేషమైన కృషి చేశారని... అందుకే హెల్త్ యూనివర్శిటీకి ఆయన పేరు పెట్టాలని చాలా మంది కోరారని చెప్పారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు బీసీలకు తీరని ద్రోహం చేశారని... బీసీ న్యాయమూర్తులకు పదవులు రాకుండా అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ఒక్క బీసీనైనా రాజ్యసభకు పంపించారా? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం బీసీలకు పెద్ద పీట వేసిందని చెప్పారు. మంత్రివర్గంలోని 25 మందిలో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉన్నారని అన్నారు.

More Telugu News