WTC: టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్ వేదికలను ప్రకటించిన ఐసీసీ

  • రెండేళ్లకోమారు ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్
  • గతేడాది ఇంగ్లండ్ గడ్డపై ఫైనల్స్
  • 2023, 2025లోనూ ఇంగ్లండ్ గడ్డపైనే ఫైనల్స్
  • ఇంకా ఖరారు కాని తేదీలు
ICC announces world test championship finals venues

టెస్టు క్రికెట్ పునరుజ్జీవం కోసం ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా వివిధ జట్ల మధ్య టెస్టు సిరీస్ లు జరిపి పాయింట్ల ఆధారంగా రెండేళ్లకోసారి ఫైనల్ మ్యాచ్ లు నిర్వహిస్తారు. 

ఈ నేపథ్యంలో, 2023, 2205లో టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్ కు వేదికలను ఐసీసీ ప్రకటించింది. ఈ రెండు పర్యాయాలు ఇంగ్లండ్ గడ్డపైనే టెస్టు టైటిల్ సమరాలు జరగనున్నాయి. 2023లో ఓవల్ మైదానం, 2025లో లార్డ్స్ మైదానం టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్ కు ఆతిథ్యమివ్వనున్నట్టు ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

జులైలో బర్మింగ్ హామ్ లో జరిగిన ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ రెండు ఫైనల్స్ జరిగే తేదీలను ఇంకా ఖరారు చేయలేదు. గతేడాది జరిగిన వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్ కు కూడా ఇంగ్లండే వేదికగా నిలిచింది. టీమిండియా, న్యూజిలాండ్ మధ్య ఈ మ్యాచ్ సౌతాంప్టన్ లో జరిగింది.

More Telugu News