Mike Tyson: అనారోగ్యంతో బాధ పడుతున్న మైక్ టైసన్

Mike Tyson suffering from ill health
  • సయాటికా వ్యాధితో బాధపడుతున్నానన్న టైసన్
  • వెన్ను కింది భాగంలో నొప్పి వస్తుందని వెల్లడి
  • నొప్పి ఎక్కువైనప్పుడు కనీసం మాట్లాడలేనన్న టైసన్
ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల మియామి విమానాశ్రయంలో చక్రాల కుర్చీలో కనపడటంతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే, సయాటికా అనే సమస్యతో బాధపడుతున్నానని టైసన్ చెప్పారు. ఈ సమస్య కారణంగా వెన్ను కింది భాగం, పిరుదులు, కాళ్లలో తీవ్రమైన నొప్పి వస్తుంటుందని... నొప్పి మరింత ఎక్కువైనప్పుడు కనీసం మాట్లాడలేనని అన్నారు. అయితే, ప్రస్తుతం పరిస్థితి మెరుగ్గానే ఉందని చెప్పారు. ఇదిలావుంచితే, విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'లైగర్' సినిమాలో మైక్ టైసన్ నటించిన సంగతి తెలిసిందే.
Mike Tyson
Boxer
Health

More Telugu News