Roja: డేటా దొంగ చంద్రబాబు.. డేరా బాబా కంటే డేంజరస్: రోజా

Chandrababu is more dangerous than dera Baba says Roja
  • సాధికారత సర్వే పేరుతో డేటాను చోరీ చేశారన్న రోజా 
  • 30 లక్షల ఓట్లను అక్రమంగా తొలగించాలనుకున్నారని ఆరోపణ  
  • చంద్రబాబు ఒక్క పథకాన్ని కూడా సొంతంగా అమలు చేయలేదని విమర్శ 
టీడీపీ ప్రభుత్వ హయాంలో డేటా చోరీ జరిగిందని మంత్రి రోజా అన్నారు. డేటా దొంగ చంద్రబాబు అని విమర్శించారు. డేరా బాబా కంటే డేటా దొంగ చాలా డేంజరస్ అని చెప్పారు. ప్రజా సాధికారత సర్వే పేరుతో సేవా మిత్ర ద్వారా టీడీపీ నాయకులకు విలువైన సమాచారాన్ని అందించారని తెలిపారు. 

ఈ అంశంపై వేసిన హౌస్ కమిటీ తన రిపోర్టును ఇవ్వగానే టీడీపీ నేతల గుండెలు జారిపోయాయని చెప్పారు. డేటా చోరీ అంశంపై చంద్రబాబు కోర్టులో స్టే తెచ్చుకోకపోతే జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. దాదాపు 30 లక్షల ఓట్లను అక్రమంగా తొలగించాలని దుర్మార్గపు ఆలోచన చేశారని విమర్శించారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాపింగ్ చేయించి, వారిని బ్లాక్ మెయిల్ చేసి టీడీపీలో చేర్చుకున్నారని చెప్పారు. 

నారా లోకేశ్ ఒళ్లు తగ్గించుకోవడానికి ఏవేవో చేశారని... బుర్రలో గుజ్జును పెంచుకోవడానికి కూడా ఏదైనా చేస్తే బాగుంటుందని రోజా ఎద్దేవా చేశారు. అన్నా క్యాంటీన్లు ఎన్ని పెట్టారో చర్చకు సిద్ధమా? అని ఆమె సవాల్ విసిరారు. చంద్రబాబు ఏ ఒక్క పథకాన్నీ కూడా సొంతంగా అమలు చేయలేదని అన్నారు. టీడీపీ నేతలకు సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పారు.
Roja
YSRCP
Dera Baba
Chandrababu
Telugudesam

More Telugu News