Vivek Agnihotri: దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ లపై ప్రశంసల జల్లు కురిపించిన 'ది కశ్మీర్ ఫైల్స్' దర్శకుడు

  • 'సీతారామం' సినిమాను నిన్న రాత్రి చూశానన్న వివేక్ అగ్నిహోత్రి
  • దుల్కర్ నటన రిఫ్రెషింగ్ గా ఉందని ప్రశంస
  • మృణాల్ పెద్ద స్టార్ అవుతుందని కితాబు
Vivek Agnihotri praises Dulquer Salmaan and Mrunal

'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రంతో దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి ఘన విజయాన్ని అందుకున్నారు. విమర్శకుల ప్రశంసలను సైతం పొందారు. ఈ సినిమాను పలువురు కీలక రాజకీయ నేతలు కూడా ప్రశంసించారు. మరోవైపు, ఇటీవల విడుదలైన టాలీవుడ్ చిత్రం 'సీతారామం' అద్భుత విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, సుమంత్, తరుణ్ భాస్కర్, భూమిక చావ్లా, ప్రకాశ్ రాజ్, మురళి శర్మ, వెన్నెల కిశోర్ తదితరులు నటించారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించగా... అశ్వనీదత్ దీనిని నిర్మించారు. ఇప్పుడీ సినిమాపై వివేక్ అగ్నహోత్రి ప్రశంసలు కురిపించారు. 

హను రాఘవపూడి తెరకెక్కించిన 'సీతారామం' సినిమాను నిన్న రాత్రి చూశానని వివేక్ అగ్నిహోత్రి తెలిపారు. దుల్కర్ నటన చాలా రిఫ్రెషింగ్ గా, అద్భుతంగా ఉందని కితాబునిచ్చారు. తొలిసారి మృణాల్ ఠాకూర్ నటనను చూశానని... చాలా ఫ్రెష్ గా, సహజంగా ఉందని కొనియాడారు. మృణాల్ పెద్ద స్టార్ అవుతుందని చెప్పారు. ఈ మేరకు వివేక్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

More Telugu News