Akash Chopra: మూడేళ్ల నుంచి ఒక్క మ్యాచ్ కూడా ఆడని వ్యక్తిని ఆస్ట్రేలియాతో సిరీస్ కు ఎలా ఎంపిక చేస్తారు?: ఆకాశ్ చోప్రా

  • ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్ కు షమీ, ఉమేశ్ ఎంపిక
  • 2019 నుంచి జాతీయ జట్టుకు ఆడని ఉమేశ్
  • కరోనా కారణంగా ఏడాది కాలంగా ఆడని షమీ
Akash Chopra fires on selection of Shami and Umesh for T20 series against Australia

ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్ కు బీసీసీఐ జట్టును ఎంపిక చేసింది. జట్టు ఎంపికపై టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా విమర్శలు గుప్పించారు. వివరాల్లోకి వెళ్తే... ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ కరోనా బారిన పడ్డాడు. అయితే షమీతో పాటు ఉమేశ్ యాదవ్ ను కూడా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ... ఉమేశ్ 2019 నుంచి ఇప్పటి వరకు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించలేదని అన్నారు. ఇలాంటి వ్యక్తిని ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. 

ఇక షమీ ప్రస్తుత సంవత్సరంలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదని గుర్తుచేశారు. టీ20 ప్రపంచకప్ కు మరో నాలుగు వారాలు మాత్రమే మిగిలి ఉన్న ఈ సమయంలో వీరిద్దరినీ ఎలా ఎంపిక చేస్తారని చోప్రా ప్రశ్నించారు. వరల్డ్ కప్ కు బీసీసీఐ ప్లాన్స్ అన్నీ తలకిందులైనట్టుగా అనిపిస్తోందని అన్నారు. మరోవైపు ఇదే విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ... షమీ, ఉమేశ్ ఇద్దరూ ఎంతో అనుభవం ఉన్న ఆటగాళ్లని... వీరు కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం ఏమీ లేదని వ్యాఖ్యానించారు.

More Telugu News