ఈ నెల 25 నుంచి తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు
- తెలంగాణకు కొత్త శోభ
- 9 రోజుల పాటు ఘనంగా బతుకమ్మ వేడుకలు
- అక్టోబరు 3 వరకు ఉత్సవాలు
అక్టోబరు 3న ట్యాంక్ బండ్ వద్ద బతుకమ్మ ఉత్సవాల కోసం విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. బతుకమ్మ ఉత్సవాల నిర్వహణపై హైదరాబాద్ బీఆర్కే భవన్ లో సమన్వయ సమావేశం నిర్వహించగా, సీఎస్ సోమేశ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.