Andhra Pradesh: రేపే ఏపీ అసెంబ్లీ ముందుకు పెగాస‌స్ క‌మిటీ నివేదిక‌

  • టీడీపీ హ‌యాంలో పెగాసస్ ప‌రిక‌రాల‌ను కొనుగోలు చేసిన‌ట్లు ఆరోప‌ణ‌
  • భూమ‌న నేతృత్వంలో హౌజ్ క‌మిటీని ఏర్పాటు చేసిన స్పీక‌ర్‌
  • ఆయా శాఖ‌ల అధికారుల‌ను విచారించిన క‌మిటీ
  • 85 పేజీల‌తో నివేదిక‌ను రూపొందించిన వైనం
  • టీడీపీ స‌ర్కారు పెగాస‌స్ ప‌రిక‌రాలు కొనుగోలు చేసింద‌ని నిర్ధార‌ణ‌?
house committe on pegasus will submit its report to ap assembly tomorrow

ఏపీ రాజ‌కీయాల‌లో కలకలం రేపిన పెగాస‌స్ వ్య‌వ‌హారంలో ఓ కీల‌క నివేదిక రేపు (మంగ‌ళ‌వారం) ఏపీ అసెంబ్లీ ముందుకు రానుంది. టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో విప‌క్ష స‌భ్యుల ఫోన్ల‌ను ట్యాప్ చేసేందుకు నాటి ప్ర‌భుత్వం ఇజ్రాయెల్‌కు చెందిన పెగాస‌స్ సంస్థ‌కు చెందిన నిఘా ప‌రిక‌రాల‌ను కొనుగోలు చేసినట్లుగా ఆరోప‌ణ‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంలో నిజాల‌ను నిగ్గు తేల్చేందుకు వైసీపీ ప్ర‌భుత్వ ప్ర‌తిపాద‌న మేర‌కు ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం... శాస‌న స‌భా క‌మిటీని ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. 

తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ఈ క‌మిటీ ఇప్ప‌టికే ఈ వ్య‌వ‌హారంపై విచార‌ణ చేప‌ట్టింది. ఆయా శాఖ‌ల‌కు చెందిన అధికారుల‌ను విచారించింది. ఆయా శాఖ‌ల వ‌ద్ద ఉన్న ఆధారాల‌ను కూడా సేక‌రించింది. అధికారుల విచార‌ణ‌, ఆధారాల సేక‌ర‌ణల‌తో మొత్తంగా 85 పేజీల‌తో క‌మిటీ త‌న నివేదిక‌ను రూపొందించింది. టీడీపీ ప్ర‌భుత్వం పెగాస‌స్ ప‌రిక‌రాల‌ను కొనుగోలు చేసినట్టు క‌మిటీ తేల్చినట్టు తెలుస్తోంది. ఈ క‌మిటీ నివేదిక నేప‌థ్యంలో రేప‌టి ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు వాడీవేడీగా సాగ‌నున్నాయి.

More Telugu News