Kolagatla Veerabhadra Swamy: ఏపీ డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవం... చైర్ వద్దకు గౌరవంగా తోడ్కొనివెళ్లిన సీఎం జగన్, అచ్చెన్నాయుడు

Kolagatla Veerabhadra Swamy elected unanimously as AP Assembly Deputy Speaker
  • ఇటీవల డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి రాజీనామా
  • ఉప సభాపతి ఎన్నిక కోసం నామినేషన్
  • కోలగట్ల ఒక్కరే నామినేషన్ వేసిన వైనం
  • ఏకగ్రీవం అయినట్టు ప్రకటించిన స్పీకర్ తమ్మినేని
  • కోలగట్లకు అభినందనలు తెలిపిన సీఎం జగన్ తదితరులు
ఏపీ డిప్యూటీ స్పీకర్ గా వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల ఏపీ డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి రాజీనామా చేయడం తెలిసిందే. దాంతో, ఉప సభాపతి పదవి ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే, కోలగట్ల వీరభద్రస్వామి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ బలాబలాల రీత్యా ఈ పదవికి టీడీపీ పోటీ చేయలేదు. 

ఈ నేపథ్యంలో, నేడు ఎన్నిక ఫలితాన్ని అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. కోలగట్లను సీఎం జగన్ ఆత్మీయ ఆలింగనం చేసుకుని అభినందించారు. ఇతర శాసనసభ్యులు కూడా నూతన డిప్యూటీ స్పీకర్ కు అభినందనలు తెలిపారు. 

అనంతరం, సీఎం జగన్, మంత్రులు, విపక్ష నేత అచ్చెన్నాయుడు... కోలగట్ల వీరభద్రస్వామిని చైర్ వద్దకు గౌరవంగా తోడ్కొనిపోయారు. సీటులో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు.
.
Kolagatla Veerabhadra Swamy
Deputy Speaker
AP Assembly
YSRCP
Andhra Pradesh

More Telugu News