ఐఫోన్12 పై భారీ ఆఫర్ ప్రకటించిన అమెజాన్

ఐఫోన్14 సిరీస్‌ను ప్రారంభించిన తర్వాత ఆపిల్ ఇటీవల ఐఫోన్ 12 ధరను తగ్గించింది. ప్రస్తుతం 64 జీబీ స్టోరేజ్ ఉన్న ఐఫోన్12 ధర రూ. 59,900గా ఉంది. 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 64,900గా ఉంది. అయితే ఐఫోన్‌ 12ను కొనుగోలు చేయాలనుకుంటున్న వినియోగదారులకు ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ శుభవార్త చెప్పింది. ఈ నెల 23న మొదలయ్యే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఐఫోన్ 12 (128 జీబీ) మోడల్ పై భారీ తగ్గింపు ప్రకటించింది. ఈ మోడల్ ను రూ. 30 వేల నుంచి రూ. 40 వేల లోపే కొనుగోలు చేయవచ్చని తెలిపింది. అయితే, ఖచ్చితమైన ధర వివరాలు మాత్రం వెల్లడించలేదు. 

ఈనెల 23న ప్రారంభమయ్యే అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ సందర్భంగా, స్మార్ట్‌ఫోన్ కస్టమర్లకు మరిన్ని ఆఫర్లను అమెజాన్ అందుబాటులో ఉంచింది. బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్చేంజ్ ఆఫర్‌లతో ఐ ఫోన్12 (128 జీబీ)ని రూ. 30 వేలకు కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ఈ లెక్కన 64 జీబీ మోడల్ రూ. 30 లోపే ఉండేలా కనిపిస్తోంది.

iPhone 12
Amazon
discount
Amazon Great India Festival sale

More Telugu News