Virat Kohli: కోహ్లీ, పాండ్యా ‘షకబూమ్’ డ్యాన్స్ చూశారా.. వీడియో ఇదిగో!

Virat Kohli and Hardik Pandya DANCE to viral song Shakaboom
  • టిక్ టాక్ వైరల్ వీడియోకు స్టెప్పులు వేసిన క్రికెటర్లు
  • ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లో పోస్ట్ చేసిన హార్దిక్ 
  • ఇద్దరి సరదా స్టెప్పులు చూసి నవ్వుకుంటున్న ఫ్యాన్స్
టీమిండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా అద్భుతమైన ఆటగాళ్లే కాదు మంచి స్నేహితులు కూడా. మైదానంలో కలిసికట్టుగా ఆడుతూ జట్టును గెలిపించే వీళ్లు బయట చాలా సరదాగా ఉంటారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి చేసిన డ్యాన్స్ రీల్ సోషల్ మీడియాలో హల్ చేస్తోంది. టిక్ టాక్ లో వైరల్ అవుతున్న ‘షకబూమ్’ పాటకు ఈ ఇద్దరూ కలిసి కాళ్లు కదిపారు. షార్ట్స్ ధరించిన పాండ్యా, కోహ్లీ నల్ల కళ్లజోడు పెట్టుకొని కో ఆర్టినేషన్ తో  స్టెప్పులు వేశారు. ఈ వీడియోను హార్దిక్ పాండ్యా తన ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. అంతే.. క్షణాల్లో వైరల్ అయ్యింది. కోహ్లీ, పాండ్యా ఫన్నీ స్టెప్పులు నవ్వులు పూయిస్తోంది. 

ప్రస్తుతం ఈ ఇద్దరూ మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగే తొలి టీ20 కోసం మొహాలీలో ఉన్నారు. ఆదివారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో కోహ్లీ ముమ్మరంగా సాధన చేశాడు. ఆసియా కప్ లో అద్భుతంగా ఆడిన కోహ్లీ అదే ఫామ్ కొనసాగించాలని చూస్తున్నాడు. మరోవైపు ఆసియా కప్ లో తొలి మ్యాచ్ లో మినహా అంతగా ఆకట్టుకోలేకపోయిన పాండ్యా ఆస్ట్రేలియాతో సిరీస్ లో  సత్తా చాటాలని ఆశిస్తున్నాడు.
Virat Kohli
hardik pandya
dance
Viral Videos

More Telugu News