KTR: హిందీ, ఇంగ్లిష్ రాదని తెలుగు మహిళ సీటు మార్చిన ఇండిగో విమాన సిబ్బంది... స్పందించిన కేటీఆర్

Recruit more staff who can speak the local language like Telugu KTR requests to INDIGO Airlines
  • ఈ నెల 16న విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న విమానంలో ఘటన
  • తెలుగు మహిళ సీటు మార్చి వివక్ష చూపారని అహ్మదాబాద్ ఐఐఎం అసిస్టెంట్ ప్రొఫెసర్ ట్వీట్
  • స్థానిక భాషలు మాట్లాడే సిబ్బందిని నియమించుకోవాలని ఇండిగోకు కేటీఆర్ సూచన 
హిందీ, ఇంగ్లిష్ రాని కారణంగా తమ విమానంలో ప్రయత్నిస్తున్న ఓ తెలుగు మహిళా ప్రయాణికురాలు సీటును బలవంతంగా మార్చిన ఇండిగో విమాన సిబ్బంది తీరుపై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ప్రాంతీయంగా నడిచే విమానాల్లో స్థానిక భాషలు మాట్లాడే సిబ్బందిని నియమించుకోవాలని ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంగ్లిష్‌, హిందీ రానివారి సౌకర్యార్థం తెలుగు, తమిళ, కన్నడ తదితర భాషలు మాట్లాడేవారిని నియమించాలని ట్విట్టర్‌లో కోరారు. 

ఈనెల 16న  ఓ మహిళ విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఇండిగో విమానంలో వస్తుండగా ఆమెకు ఇంగ్లిష్/హిందీ రాదన్న కారణంతో కూర్చున్న సీట్లోంచి తీసుకెళ్లి.. మరో చోట కూర్చోబెట్టారు. ఈ ఘటనపై అహ్మదాబాద్ ఐఐఎంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న దేవస్మిత తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. 2ఎ సీట్లో ఎగ్జిట్ డోర్ దగ్గర కూర్చుకున్న సదరు మహిళకు హిందీ/ఇంగ్లిష్ రాదని తెలుసుకొని 3సి సీట్లోకి మార్చేశాని, ఆమెతో మాట్లాడిన ఫ్లైట్ అటెండెంట్ భద్రతా పరమైన ఆందోళనగా పేర్కొంటూ ఆ మహిళ పట్ల వివక్ష ప్రదర్శించారని ట్వీట్ చేశారు. సదరు తెలుగు మహిళ ఫొటోను కూడా షేర్ చేశారు. 

దీనిపై కేటీఆర్  స్పందించి ట్వీట్ చేశారు. స్థానిక భాషలు మాత్రమే మాట్లాడగలిగిన ప్రయాణికులను కూడా గౌరవించాలని సూచిస్తూ ఇండిగో యాజమాన్యానికి ట్యాగ్ చేశారు. విమానాలు ప్రయాణించే మార్గాల ఆధారంగా ఆయా భాషలు మాట్లాడగలిగే సిబ్బందిని నియమించుకోవాలని ఇండిగోకు సూచించారు. అలా అయితే, ప్రయాణికులు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అభిప్రాయపడ్డారు.
KTR
indigo
airlines
local languages
passenger
hindi
english

More Telugu News