తైవాన్ ను కుదిపేసిన భారీ భూకంపం
- ఆగ్నేయ తీరంలో ప్రకంపనలు
- రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతతో భూకంపం
- తైటుంగ్ పట్టణానికి ఉత్తరంగా భూకంప కేంద్రం
- ఊగిపోయిన భవనాలు, రైళ్లు
- పరుగులు తీసిన ప్రజలు
కాగా, ఈ భూకంప తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జపాన్ అధీనంలోని దీవులకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భారీ స్థాయిలో ప్రకంపనలు రావడంతో ఇళ్ల నుంచి, షాపింగ్ మాల్స్ నుంచి పరుగులు తీస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. ఈ భూకంపం తాలూకు ప్రకంపనలు రాజధాని తైపేలోనూ వచ్చినట్టు ఓ మీడియా ప్రతినిధి వెల్లడించారు.
ఇదే ప్రాంతంలో నిన్న 6.6 తీవ్రతతో భూకంపం సంభవించగా, నేడు అంతకుమించిన తీవ్రతతో భూమి కంపించడం ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. భారీ ప్రకంపనలకు పట్టాలపై ఉన్న రైళ్లు కూడా ఊగిపోయాయి.