Amaravati: అమరావతి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. జగన్ ది మైండ్ గేమ్ మాత్రమే: జేసీ ప్రభాకర్ రెడ్డి

Jagan is playing mind game with Amaravati farmers says JC Diwakar Reddy
  • రాజధాని అమరావతిలోనే ఉంటుంది
  • మా ప్రాంతంలో కూడా రైతులు పాదయాత్ర చేయాలి
  • ఉత్తరాంధ్రకు రైతులు వెళ్లొద్దని చెప్పడం సరికాదు
అమరావతి రైతులకు టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. మహా పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులను ఈరోజు ఆయన కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్పారు. రాజధాని అమరావతిలోనే ఉంటుందని అన్నారు. అమరావతే రాజధాని అని హైకోర్టు చెప్పిన ఆరు నెలలకు సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వ వెళ్లడం ఏమిటని ఎద్దేవా చేశారు. 

అమరావతి రైతులకు మద్దతు ప్రకటించేందుకు తాను రాయలసీమ నుంచి ఇక్కడకు వచ్చానని చెప్పారు. తనను ఎవరూ ఆపలేదని తెలిపారు. తమ ప్రాంతంలో కూడా పాదయాత్ర చేయాలని కోరుతున్నానని తెలిపారు. ఉత్తరాంధ్రకు వెళ్లొద్దని రైతులకు చెప్పడం సరికాదని అన్నారు. అన్ని ప్రాంతాలకు అమరావతి సమ దూరంలో ఉంటుందని చెప్పారు. రైతులను మానసికంగా భయపెట్టడానికే జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని అన్నారు. వైసీపీ నేతలకు గత అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నంత ఊపు ఇప్పుడు లేదని చెప్పారు.
Amaravati
Farmers
Padayatra
JC Prabhakar Reddy
Telugudesam
Jagan
YSRCP

More Telugu News