ఎవరితోనైనా రిలేషన్ షిప్ ఉంటే కొనసాగించమని నా కూతురుకు చెప్పాను: శ్వేతా తివారి
- పెళ్లిపై తనకు నమ్మకం లేదన్న శ్వేతా తివారి
- పెళ్లి చేసుకోమని తన కూతురిపై ఒత్తిడి చేయబోనని వ్యాఖ్య
- రిలేషన్ షిప్ ను పెళ్లి వరకు తీసుకురావద్దని సూచించానన్న శ్వేత
ఎవరితోనైనా రిలేషన్ షిప్ లో ఉంటే దాన్ని కొనసాగించమని తన కూతురుకి చెప్పానని... అయితే, ఆ సంబంధాన్ని పెళ్లి వరకు తీసుకురావద్దని సూచించానని శ్వేత తెలిపింది. ఇద్దరు పిల్లలకు సింగిల్ పేరెంట్ గా ఉన్నప్పటికీ తాను ఎలాంటి ఇబ్బంది పడటం లేదని చెప్పింది. డబ్బు కోసమో, ఇంకో అవసరం కోసమో తన మాజీ భర్తను ఎప్పుడూ సాయం కోరలేదని తెలిపింది. తాను రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇప్పుడు ఒక్కరితో కూడా కలిసి ఉండటం లేదని సోషల్ మీడియాలో తనపై కామెంట్లు వస్తుంటాయని... వాటిని తాను పట్టించుకోనని చెప్పింది.