Telangana: తెలంగాణలో తాజాగా 99 కరోనా కేసులు

  • గత 24 గంటల్లో 9,450 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 49 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 106 మంది
  • ఇంకా 768 మందికి చికిత్స
Telangana corona daily update

తెలంగాణలో కరోనా వ్యాప్తి బాగా నిదానించింది. గడచిన 24 గంటల్లో 9,450 కరోనా పరీక్షలు నిర్వహించగా, 99 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 49 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 106 మంది కరోనా నుంచి కోలుకోగా, కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. 

తెలంగాణలో ఇప్పటివరకు 8,36,621 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,31,742 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 768 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 4,111 మంది మృతి చెందారు.

More Telugu News