BJP: మోదీ జ‌న్మ‌దినాన ర‌క్త దానం చేసిన కేంద్ర మంత్రి శోభ‌... ఫొటో ఇదిగో

union minister  Shobha Karandlaje donates blood on modi birth day
  • మోదీ జ‌న్మ‌దినాన దేశ‌వ్యాప్తంగా ర‌క్త దాన శిబిరాలు
  • భారీగా త‌ర‌లివ‌చ్చి ర‌క్తం దానం చేసిన బీజేపీ శ్రేణులు
  • స్వ‌యంగా ఓ ర‌క్త‌దాన శిబిరానికి వ‌చ్చి ర‌క్తం ఇచ్చిన కేంద్ర మంత్రి
ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ జ‌న్మ దినాన్ని పుర‌స్క‌రించుకుని శ‌నివారం బీజేపీ కార్య‌క‌ర్త‌లు దేశ‌వ్యాప్తంగా ర‌క్త దానం చేశారు. పార్టీ పిలుపు మేర‌కు దేశ‌వ్యాప్తంగా ఎక్క‌డిక‌క్క‌డ ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు ర‌ర్త దాన శిబిరాల‌ను ఏర్పాటు చేశారు. ఈ శిబిరాల్లో ర‌క్త దానం చేసేందుకు పార్టీ శ్రేణులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. 

బీజేపీకి చెందిన సామాన్య కార్య‌క‌ర్త మాదిరే... క‌ర్ణాట‌క‌కు చెందిన బీజేపీ కీల‌క నేత‌, కేంద్ర వ్య‌వ‌సాయ‌, రైతు సంక్షేమ శాఖ స‌హాయ మంత్రి శోభా క‌రంద్లాజే కూడా శ‌నివారం స్వ‌యంగా ఓ ర‌క్త దాన శిబిరానికి వెళ్లి ర‌క్త దానం చేశారు. మోదీ జ‌న్మ‌దినాన్ని దేశ ప్ర‌జ‌లు ఎంత‌టి ఆనందంతో జ‌రుపుకుంటున్నారో.. అదే స్ఫూర్తితో తాను కూడా ర‌క్త దానం చేశానంటూ ఆమె పేర్కొన్నారు.
BJP
Prime Minister
Narendra Modi
Modi Birth Day
Blood Donation
Shobha Karandlaje

More Telugu News