Manchu Vishnu: పది పుషప్స్ చేస్తే తాను ఇలా ఉంటాడట.. మంచు విష్ణు సరదా ట్వీట్

- కండలు తిరిగి బలంగా ఉన్న దున్నపోతు ఫొటో పోస్టు చేసిన మంచు విష్ణు
- వ్యాయామం చేసిన తర్వాత తాను అలా ఉంటానని భావిస్తానంటూ క్యాప్షన్
- సరదాగా కామెంట్లు చేస్తున్న నెటిజన్లు, అభిమానులు
కొందరు కొంత సేపు వ్యాయామం చేయగానే తమకు ఏదో బలం వచ్చేసినట్టు, తాము దృఢంగా అయిపోయినట్టు భావిస్తుంటారు. వ్యాయామం చేయగానే తమకేదో కొత్త శక్తి వచ్చినట్టు అనిపిస్తుందని అంటారు. ఈ విషయాన్నే టాలీవుడ్ హీరో, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు ఓ సరదా ఫొటో కామెంట్ తో చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ దున్నపోతు ఫొటో పెట్టి ట్వీట్ చేశారు.
బలమైన దున్నపోతు ఫొటోతో..

విడుదలకు సిద్ధమవుతున్న ‘జిన్నా’ సినిమా
మంచు విష్ణు ప్రస్తుతం జిన్నా సినిమాలో నటిస్తున్నారు. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా సూర్య దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ ను కూడా విడుదల చేశారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో రూపొందిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు ఇటీవలే దర్శకుడు వెల్లడించారు.