Amit Shah: ప్రజలంతా నిస్సంకోచంగా హైదరాబాద్ విమోచన దినోత్సవం జరుపుకోవచ్చు: అమిత్ షా

Amit Shah speech in Hyderabad liberation day celebrations
  • పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవం
  • ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా
  • పటేల్ వల్ల హైదరాబాద్ కు విమోచనం లభించిందన్న కేంద్ర హోం మంత్రి
హైదరాబాద్ విమోచన దినోత్సవం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా ప్రసంగిస్తూ... ఇప్పటి వరకు ఈ ప్రాంతాన్ని పాలించిన పార్టీలన్నీ రాజకీయాల కోసమే పని చేశాయని... విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపలేదని అన్నారు. 

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా, హైదరాబాద్ కు రాలేదని... ఆనాటి హోం మంత్రి పటేల్ వల్ల హైదరాబాద్ కు విమోచనం లభించిందని చెప్పారు. హైదరాబాద్ విమోచనానికి పటేల్ విశేష కృషి చేశారని కొనియాడారు. నిజాం, రజాకార్ల ఆగడాలకు ఆపరేషన్ పోలో ద్వారా సర్దార్ పటేల్ ముగింపు పలికారని చెప్పారు. హైదరాబాద్ రాష్ట్రానికి, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు సెప్టెంబర్ 17న స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. ఇప్పుడు మన ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోందని... ప్రజలందరూ నిస్సంకోచంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించుకోవచ్చని చెప్పారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం విమోచనన దినాన్ని ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే విమోచన దినాన్ని నిర్వహించడం లేదని అన్నారు. ఈరోజు జాతీయ జెండాను ఎగురవేయడం సంతోషంగా ఉందని చెప్పారు.
Amit Shah
BJP
Hyderabad Liberation Day

More Telugu News