Narendra Modi: ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్, జగన్, చంద్రబాబు

KCR Jagan Chadrababu greets Modi on his birthday
  • నేడు ప్రధాని మోదీ జన్మదినం
  • తెలంగాణ ప్రజల తరపున శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
  • ప్రధానికి ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించిన జగన్
  • మోదీని కలిసినప్పటి ఫొటోను షేర్ చేసిన చంద్రబాబు  
ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా పార్టీలకు అతీతంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.   

తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలను కేసీఆర్ తెలియజేశారు. దేశానికి మరెన్నో సంవత్సరాల పాటు సేవ చేయాలని... మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. 

గౌరవనీయులైన ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని జగన్ ట్వీట్ చేశారు. ప్రధానికి ఆయురారోగ్యాలను భగవంతుడు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. 

ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు. దేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపేందుకు, దేశ ప్రజలకు సేవ చేసేందుకు ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, ఆయుష్షును భగవంతుడు ఇవ్వాలని ఆకాంక్షించారు. మోదీని కలిసినప్పటి ఫొటోను షేర్ చేశారు.


Narendra Modi
BJP
KCR
TRS
Jagan
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News