Kolagatla Veerabhadra Swamy: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి కోలగట్ల వీరభద్రస్వామి నామినేషన్

YCP leader Kolagatla Veerabhadra Swamy files nomination for Deputy Speaker election
  • డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి రాజీనామా
  • డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
  • నామినేషన్ పత్రాలు సమర్పించిన కోలగట్ల
  • సోమవారం ఎన్నిక!
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి రాజీనామా చేసిన నేపథ్యంలో, ఎన్నిక జరగనుంది. ఈ ఉదయమే నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నేపథ్యంలో, డిప్యూటీ స్పీకర్ పదవికి వైసీపీ తరఫున కోలగట్ల వీరభద్రస్వామి ఈ సాయంత్రం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. నామినేషన్లకు ఈ సాయంత్రం వరకు గడువు ఉంది. 

కాగా, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సోమవారం జరగనుంది. ఈ పదవికి టీడీపీ నుంచి పోటీ ఉండదని తెలుస్తోంది. దాంతో కోలగట్ల ఎన్నిక ఏకగ్రీవం కావడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా, సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే, కోన రఘుపతిని డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేయాలని వైసీపీ హైకమాండ్ కోరినట్టు సమాచారం.
Kolagatla Veerabhadra Swamy
Nomination
Deputy Speaker
Assembly
YSRCP
Andhra Pradesh

More Telugu News