Harish Rao: కేసీఆర్ నినాదం ఇదే: హరీశ్ రావు

Harish Rao fires on opposition
  • మత విద్వేషాలు రాష్ట్రానికి మంచిది కాదన్న హరీశ్ రావు 
  • కుల, మతాల పేరుతో చిచ్చు పెట్టేందుకు కొందరు యత్నిస్తున్నారని విమర్శ 
  • సంపద పెంచు, ప్రజలకు పంచు అనేది కేసీఆర్ నినాదమని వ్యాఖ్య 
మత విద్వేషాలు రాష్ట్ర ఉన్నతికి మంచిది కాదని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం అందరం కలసి కట్టుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఎనిమిదేళ్ల కాలంలో భారత ధాన్యాగారంలా తెలంగాణ అవతరించిందని చెప్పారు. సంపద పెంచు, ప్రజలకు పంచు అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ నినాదమని తెలిపారు. పెత్తందారులను తిప్పి కొట్టిన గడ్డ తెలంగాణ అని చెప్పారు. కుల, మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు కొందరు యత్నిస్తున్నారని విమర్శించారు. సిద్ధిపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమైక్యత వజ్రోత్సవ ర్యాలీలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Harish Rao
KCR
TRS

More Telugu News