రాజధాని ప్రకటన జరిగిన తర్వాత అక్కడ భూములు కొంటే తప్పేముంది?: పయ్యావుల కేశవ్
- అమరావతిలో పయ్యావుల కుమారుడు భూములు కొన్నారన్న బుగ్గన
- అమరావతిలో భూములు కొన్న మాట వాస్తవమేనన్న పయ్యావుల
- రాజధానిపై నాటి సీఎం చంద్రబాబు ప్రకటన చేసిన తర్వాత కొన్నామని వెల్లడి
బుగ్గన ఆరోపణలు చేస్తున్న సమయంలో సభలోనే ఉన్న పయ్యావుల కేశవ్.. బుగ్గన ప్రసంగం ముగిసిన వెంటనే ఆయన ఆరోపణలకు సమాధానం ఇచ్చారు. తన కుమారుడి పేరిట రాజధాని అమరావతిలో భూములు కొన్న మాట వాస్తవమేనని పయ్యావుల చెప్పారు. అయితే ఆ భూముల కొనుగోలు రాజధానిపై నాటి సీఎం చంద్రబాబు ప్రకటన చేసిన తర్వాత జరిగిందని ఆయన వెల్లడించారు. రాజధాని ప్రకటన జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో భూములు కొంటే తప్పేముందని కూడా పయ్యావుల ప్రశ్నించారు.