Nagarjuna: ముందు రివ్యూలు చూస్తా... రేటింగ్ బాగుంటేనే సినిమా చూస్తా: నాగార్జున

Nagarjuna opines on reviews and ratings
  • మీడియాతో మాట్లాడిన నాగ్
  • సినిమా టాక్ పై రివ్యూల ప్రభావం ఉంటుందని వెల్లడి
  • వెబ్ సిరీస్ చూడాలన్నా రివ్యూలు చూస్తానని వివరణ
  • లేకపోతే టైమ్ వేస్ట్ అని వ్యాఖ్యలు
టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ సినిమాకు వచ్చే టాక్ పై రివ్యూల ప్రభావం ఉంటుందని అన్నారు. ప్రస్తుత ట్రెండ్ లో రివ్యూలు కూడా సినిమా ప్రచారంలో ప్రధాన భూమిక పోషిస్తున్నాయని తెలిపారు.

తాను కూడా రివ్యూలు చూసిన తర్వాతే సినిమాలు చూస్తానని స్పష్టం చేశారు. సినిమాలే కాదు, ఓ వెబ్ సిరీస్ చూడాలన్నా తాను ముందు రివ్యూలు చూస్తానని వెల్లడించారు. 

సినిమా గానీ, వెబ్ సిరీస్ గానీ రేటింగ్ బాగుంటేనే చూస్తానని పేర్కొన్నారు. 7 రేటింగ్ పాయింట్లు ఉంటేనే సినిమా చూస్తానని నాగ్ వివరించారు. లేకపోతే సమయం వృథా చేసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. తాను రేటింగ్ ల కోసం ఐఎండీబీని ఫాలో అవుతానని వెల్లడించారు.

గతంలో సినిమా విడుదలైన వారం తర్వాత పత్రికల్లో రివ్యూలు వచ్చేవని, ఇప్పుడు సోషల్ మీడియా కారణంగా రివ్యూలకు గిరాకీ పెరిగిందని అన్నారు.
Nagarjuna
Review
Rating
Cinema
Web Series
Tollywood

More Telugu News