Team India: ఉప్ప‌ల్ స్టేడియంలో ఈ నెల‌ 25న టీమిండియా మ్యాచ్‌... రేప‌టి నుంచే టికెట్ల విక్ర‌యం

3rd t20 match between india and australia in uppal stadium on 25th of this month
  • ఈ నెల 20న భార‌త్ రానున్న ఆస్ట్రేలియా జ‌ట్టు
  • 25న ఉప్ప‌ల్ స్టేడియంలో మూడో టీ20 ఆడ‌నున్న ఆసిస్‌, టీమిండియా
  • పేటిఎం, ఇన్‌సైడ‌ర్ ద్వారా టికెట్ల విక్ర‌యం
  • రూ.800ల నుంచి మొద‌లు కానున్న టికెట్ ధ‌ర‌లు
సుదీర్ఘ విరామం త‌ర్వాత హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ క్రికెట్ స్టేడియం అంత‌ర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు వేదిక కానుంది. భార‌త్‌, ఆస్ట్రేలియాల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న టీ20 మ్యాచ్‌కు ఉప్ప‌ల్ స్టేడియం వేదిక కానుంది. టీమిండియాతో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ కోసం ఈ నెల 20న భార‌త్‌కు ఆస్ట్రేలియా జ‌ట్టు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాతో మూడో టీ20ని ఈనెల 25న టీమిండియా ఉప్ప‌ల్ స్టేడియంలో ఆడ‌నుంది. దాదాపుగా రెండేళ్ల త‌ర్వాత ఉప్ప‌ల్ స్టేడియంలో అంత‌ర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. 

ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల విక్ర‌యం రేపటి (సెప్టెంబరు 15) నుంచి మొద‌లు కానుంది. పేటీయం ఇన్‌సైడర్‌ (ఆన్‌లైన్‌) ద్వారా టికెట్లు అందుబాటులో ఉంటాయి. అదే విధంగా స్టేడియం వద్దనున్న ఆఫ్‌లైన్‌ కౌంటర్ల ద్వారా టికెట్ల‌ను అభిమానులు కొనుగోలు చేసుకునే వెసులుబాటును క‌ల్పించారు. రూ.800 నుంచి ప్రారంభం కానున్న టికెట్ ధ‌ర‌ల‌కు జీఎస్టీ అద‌నంగా చెల్లించాల్సి ఉంటుంది.
Team India
Cricket
Uppal Cricket Stadium
Hyderabad
Australia

More Telugu News