Pomegranates: దానిమ్మ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా...?

  • అన్ని కాలాల్లో దొరికే ఫలం దానిమ్మ
  • రక్తహీనతతో బాధపడేవారికి ఎంతో ఉపయుక్తం
  • దానిమ్మలో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు 
  • వృద్ధాప్యాన్ని త్వరగా దరిచేరనివ్వని అద్భుత ఫలం
Benefits by eating Pomegranates

సీజన్లతో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో మార్కెట్ లో విరివిగా లభించే ఫలాల్లో దానిమ్మ ఒకటి. దీనివల్ల రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. అందుకే డాక్టర్లు దానిమ్మ తినాలంటూ రోగులకు సూచిస్తుంటారు. రక్తహీనతతో బాధపడేవారికి ఇది దివ్యౌషధం వంటిదని చెబుతారు. 

దానిమ్మ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ తో పోరాడి చర్మానికి నిగారింపు అందిస్తాయి. దానిమ్మ కాయలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వృద్ధాప్యం త్వరగా రాదట. ముఖ్యంగా ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. 

అంతేకాదు, అల్జీమర్స్, రొమ్ము క్యాన్సర్, చర్మ క్యాన్సర్లకు దానిమ్మ అడ్డుకట్ట వేస్తుందనేది పరిశోధకుల మాట. పోషకాహార నిపుణులు ఏం చెబుతారంటే... గర్భిణీలు దానిమ్మను కచ్చితంగా ఆహారంలో భాగంగా చేసుకోవాలి. గర్భస్థ శిశువు ఎదుగుదలకు దానిమ్మ అందించే పోషకాలు ఎంతో దోహదపడతాయి.

More Telugu News