Sourav Ganguly: బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులుగా మరోసారి సౌరవ్ గంగూలీ, జై షా... సుప్రీంకోర్టు సమ్మతి

Supreme Court paves the way for Sourav Ganguly and Jai Shah for their second term
  • కీలక తీర్పు నిచ్చిన సుప్రీంకోర్టు
  • రెండో పర్యాయం బోర్డు పదవులు చేపట్టనున్న గంగూలీ, షా
  • కూలింగ్ ఆఫ్ పీరియడ్ రద్దుకు బీసీసీఐ ప్రతిపాదన
  • ఆ మేరకు బోర్డు రాజ్యాంగ సవరణ
ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, బోర్డు కార్యదర్శి జై షా మరోసారి తమ పదవుల్లో కొనసాగేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. బీసీసీఐ కార్యవర్గం వరుసగా రెండు పర్యాయాలు పదవుల్లో కొనసాగేందుకు ఈ తీర్పు ఉపకరించనుంది. 

బీసీసీఐ రాజ్యాంగంలోని 'కూలింగ్ ఆఫ్ పీరియడ్' నిబంధన ప్రకారం గంగూలీ, జై షాల పదవీకాలం త్వరలోనే ముగియనుంది. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం గంగూలీ, జై షా వరుసగా రెండోసారి తమ పదవులు చేపట్టేందుకు సాధ్యంకాదు. అయితే ఈ 'కూలింగ్ ఆఫ్ పీరియడ్' ను రద్దు చేస్తూ బీసీసీఐ తన రాజ్యాంగానికి సవరణ ప్రతిపాదనలు రూపొందించింది. 

తాజాగా ఈ సవరణ ప్రతిపాదనలకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. దాంతో గంగూలీ, జై షా రెండో పర్యాయం తమ పదవుల్లో కొనసాగేందుకు మార్గం సుగమం అయింది. గంగూలీ, జై షా తమ తమ రాష్ట్రాల క్రికెట్ సంఘాల్లో ఆరేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్నప్పటికీ, దానితో సంబంధం లేకుండా బీసీసీఐ పదవుల్లో కొనసాగే వెసులుబాటు లభించింది.  

ఇంతకుముందు. ఆర్ఎమ్ లోధా కమిటీ క్రికెట్ బోర్డులో సంస్కరణలు తీసుకువచ్చేందుకు పలు సిఫారసులు చేసింది. ఈ సిఫారసులకు అత్యున్నత న్యాయస్థానం ఆమోదం తెలిపింది.
Sourav Ganguly
Jai Shah
Supreme Court
BCCI

More Telugu News