Pakistan Boat: భారత తీరంలో ప్రవేశించిన పాకిస్థాన్ బోటు పట్టివేత... రూ.200 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

  • డ్రగ్స్ అక్రమరవాణాకు అడ్డాగా గుజరాత్ తీరం
  • గతేడాది రూ.21 వేల కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
  • గుజరాత్ తీరంలో మరోసారి డ్రగ్స్ పట్టుబడిన వైనం
  • పోలీసుల అదుపులో ఆరుగురు వ్యక్తులు
Pakistani boat with drugs seized in Gujarat coast

పాకిస్థాన్ నుంచి భారత్ కు ఉగ్రవాదం, ఆయుధాలే కాదు డ్రగ్స్ కూడా ఎగుమతి అవుతున్నాయి! గుజరాత్ తీరం అందుకు అడ్డాగా మారింది. 2021లో ముంద్రా పోర్టులో దాదాపు రూ.21 వేల కోట్ల విలువైన 3 వేల కిలోల మాదకద్రవ్యాలు పట్టుబడడం తెలిసిందే. 

తాజాగా డ్రగ్స్ తో ఉన్న ఓ పాకిస్థాన్ బోటును గుజరాత్ తీరంలో గుర్తించారు. జఖావ్ పోర్టుకు 33 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న ఆ బోటును కోస్ట్ గార్డ్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆ బోటును కోస్ట్ గార్డ్ నిఘా నౌక తీరానికి చేర్చింది. 

ఆ బోటులో 40 కిలోల డ్రగ్స్ ఉండగా, దాని విలువ రూ.200 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. బోటులోని ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

More Telugu News