రవితేజ జోడీగా అనుపమ పరమేశ్వరన్!
- 'కార్తికేయ 2'తో అనుపమకు హిట్
- రిలీజ్ కి రెడీగా '18 పేజెస్'
- షూటింగు దశలో 'బట్టర్ ఫ్లై'
- 'ఈగల్' సినిమాకి గ్రీన్ సిగ్నల్
తాజాగా ఆమె రవితేజ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు. 'కార్తికేయ 2' సినిమాకి సినిమాటోగ్రఫర్ గా .. ఎడిటర్ గా వ్యవహరించిన కార్తీక్ ఘట్టమనేని, దర్శకుడిగా రవితేజతో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాకి 'ఈగల్' అనే టైటిల్ ను కూడా ఖరారు చేసుకున్నారు.
ఈ సినిమాలో కథానాయికగా ఆయన అనుపమను తీసుకున్నట్టుగా సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మధ్య కాలంలో రవితేజ వరుసగా కుర్ర హీరోయిన్లతో జోడీ కడుతూ వస్తున్నాడు. ఆ జాబితాలోకి అనుపమ చేరడం విశేషం. 'ఈగల్' కి సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.