Boy killed by sister: ప్రియుడితో తిరగవద్దన్నందుకు సొంత తమ్ముడిని చంపేసింది!

Boy killed by sister after he objected her boyfriend
  • ఝార్ఖండ్ లోని రామ్ గఢ్ జిల్లాలో దారుణం
  • వేరే కులం వ్యక్తితో సంబంధం ఏమిటని తప్పుపట్టిన తమ్ముడు
  • కక్షగట్టి తన నివాసంలోనే హత్య చేసిన 25 ఏళ్ల యువతి
  • యువతిని, ఆమె ప్రియుడిని అరెస్టు చేసిన పోలీసులు
25 ఏళ్ల యువతి.. ఓ థర్మల్ పవర్ స్టేషన్ లో ఉద్యోగం చేస్తోంది. ఆ పవర్ స్టేషన్ కు సంబంధించిన క్వార్టర్స్ లోనే నివసిస్తోంది. ఆమె సోను అన్సారీ అనే వ్యక్తిని ప్రేమిస్తోంది. అతను తమ కులం వాడు కాకపోవడంతో ఆమె తమ్ముడు 21 ఏళ్ల యువకుడు ఈ సంబంధాన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టాడు. ఆమె ప్రియుడు తరచూ ఆ యువతి క్వార్టర్స్ కు వచ్చిపోతుండటం చూసి నిలదీశాడు. దీనిని మనసులో పెట్టుకున్న సదరు యువతి తన ప్రియుడితో కలిసి సొంత తమ్ముడినే హత్య చేసింది. ఝార్ఖండ్ లోని రామ్ గఢ్ జిల్లాలో ఈ దారుణం జరిగింది.

క్వార్టర్స్ లోనే మృతదేహాన్ని గుర్తించి..
థర్మల్ పవర్ స్టేషన్ లో పనిచేస్తున్న 25 ఏళ్ల యువతి పేరు చంచల కుమారి అని, ఆమె తమ్ముడు రోహిత్ కుమార్ అని స్థానిక పోలీసులు వెల్లడించారు. తన కుమారుడు కనిపించడం లేదని వారి తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో చంచల కుమారి క్వార్టర్స్ లో రోహిత్ మృతదేహం లభించింది. దీనిపై నిలదీయగా తాను, తన ప్రియుడు కలిసి హత్య చేసినట్టుగా చంచల కుమారి అంగీకరించిందని పట్రటు ఏరియా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ బీరేంద్ర కుమార్ చౌదరి వెల్లడించారు. చంచల కుమారి, సోను అన్సారీని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Boy killed by sister
jarkhand
National
Inda
Crime News

More Telugu News