Telangana: హైద‌రాబాద్‌లో డీఎఫ్ఈ ఫార్మా సెంటర్ ను ప్రారంభించిన కేటీఆర్‌

ktr inaugurated DFE Pharma new Center of Excellence in Genome Valley
  • ఇటీవ‌లే తెలంగాణ‌తో ఒప్పందం కుదుర్చుకున్న డీఎఫ్ఈ ఫార్మా
  • జీనోమ్ వ్యాలీలో కంపెనీ కేంద్రాన్ని ప్రారంభించిన కేటీఆర్‌
  • క్లోజర్ టూ ద ఫార్ములేష‌న్ ప్రాతిపదిక‌గా ప‌నిచేయ‌నున్న డీఎఫ్ఈ ఫార్మా
అంత‌ర్జాతీయ ఫార్మా దిగ్గ‌జం డీఎఫ్ఈ ఫార్మాకు చెందిన కొత్త కేంద్రాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభించారు. న‌గ‌రంలోని జీనోమ్ వ్యాలీలో ఏర్పాటైన ఈ సెంట‌ర్‌తో న‌గ‌రంలోని ఫార్మా సంస్థ‌ల‌కు లెక్క‌లేన‌న్ని ప్ర‌యోజ‌నాలు ద‌క్క‌నున్నాయి. ఫార్మా రంగంలో న‌గ‌రానికి చెందిన ఫార్మా కంపెనీలు ఫ‌స్ట్ టైమ్ రైట్ ఔష‌ధాల‌ను ఉత్ప‌త్తి చేయ‌డం, వాటిపై పేటెంట్లు పొందడం వంటి విష‌యాల్లో డీఎఫ్ఈ ఫార్మా నూతన కేంద్రం తోడ్పాటును అందించ‌నుంది. క్లోజర్ టూ ద ఫార్ములేష‌న్ ప్రాతిపాదిక‌గా ఈ కేంద్రం ప‌ని చేయ‌నుంది. తెలంగాణ‌లో త‌న కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశ‌గా ఇటీవ‌లి కేటీఆర్ విదేశీ ప‌ర్య‌ట‌న‌లో డీఎఫ్ఈ ఫార్మా ఒప్పందం కుదుర్చుకుంది.
Telangana
TRS
KTR
Genome Valley
DFE Pharma
Hyderabad

More Telugu News