Bollywood: బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు

delhi police issues notices to bollywood actress Jacqueline Fernandez
  • సుఖేశ్ చంద్ర‌శేఖ‌ర్‌తో స్నేహంతో జాక్వెలిన్‌కు తిప్ప‌లు
  • ఇప్ప‌టికే ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన బాలీవుడ్ న‌టి
  • ఈ నెల 14న విచార‌ణ‌కు రావాలంటూ న‌టికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ఆర్థిక నేరాల కేసులో జైలు శిక్ష అనుభ‌విస్తున్న సుఖేశ్ చంద్ర‌శేఖ‌ర్‌తో స్నేహం బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ముప్పు తిప్ప‌లు పెడుతోంది. మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో ఇప్ప‌టికే ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) జాక్వెలిన్‌ను విచారించ‌గా... తాజాగా ఢిల్లీ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. 

ఈ నెల 14న త‌మ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ జాక్వెలిన్‌కు, ఢిల్లీ పోలీసు శాఖ‌కు చెందిన‌ ఆర్థిక నేరాల విభాగం నోటీసులు జారీ చేసింది.
Bollywood
Jacqueline Fernandez
Delhi Police
Money Laundering Case

More Telugu News