Queen Elizabet-II: బ్రిటన్ రాణి లేఖపై సూపర్ సస్పెన్స్... 2085వ సంవత్సరంలో తెరవాలట!

  • ఇటీవలే బ్రిటన్ రాణి అస్తమయం
  • 1986లో ఓ లేఖ రాసిన క్వీన్ ఎలిజబెత్-2
  • సిడ్నీ ప్రజలను ఉద్దేశించి లేఖ
  • ఇప్పటిదాకా భద్రంగా ఉన్న లేఖ
  • తెరిచేందుకు 2085 సంవత్సరం వరకు ఆగాలని రాణి సూచన
Super suspense on Queen Elizabeth II letter to Sidney people

ఇటీవలే అస్తమించిన బ్రిటన్ రాణి ఎలిజబెత్-2కు సంబంధించిన అత్యంత ఆసక్తికర అంశం వెల్లడైంది. బ్రిటన్ రాణి రాసిన ఓ లేఖ ఆస్ట్రేలియాలో ఇప్పటికీ భద్రంగా ఉంది. 

విశేషం ఏంటంటే... ఆ లేఖను ఇంతవరకు తెరవలేదు. అంతేకాదు, 2085 వరకు ఆ లేఖను ఎవరూ తెరిచే వీల్లేదు. అది రాణి కోరిక. ఆ లేఖను 1986లో సిడ్నీ ప్రజలను ఉద్దేశించి రాణి రాశారు. 2085లోనే ఈ లేఖను తెరవండి అంటూ నాడు సిడ్నీ నగర మేయర్ కు రాణి సూచన చేశారు. ఆ లేఖలోని సందేశాన్ని సిడ్నీ ప్రజలకు అందించండి అని ఆమె పేర్కొన్నారు. 

రాణి సంతకంతో కూడిన ఆ లేఖను సిడ్నీలోని క్వీన్ విక్టోరియా హాల్ లో భద్రపరిచారు. రాణి అస్తమయం నేపథ్యంలో ఈ లేఖ సంగతి బయటికి వచ్చింది. అన్నేళ్ల పాటు తెరవొద్దని సూచించేందుకు, ఆ రాణి ఆ లేఖలో ఏం రాశారన్నది చర్చనీయాంశంగా మారింది.

More Telugu News