మద్యపాన నిషేధంపై పిటిషన్ విచారణకు నో చెప్పిన సుప్రీంకోర్టు
- దేశవ్యాప్తంగా మద్యపాన నిషేధం అమలుకు అదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్
- సుప్రీంకోర్టు సీజే జస్టిస్ లలిత్ ధర్మాసనం ముందుకు వచ్చిన పిటిషన్
- ఇది సుప్రీంకోర్టు పరిధిలోకి రాదన్న జస్టిస్ లలిత్
జాతీయ స్థాయిలో మద్యపాన నిషేధం విధించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టులో ఇటీవలే ఓ పిటిషన్ దాఖలైంది. దేశవ్యాప్తంగా మద్యపాన నిషేధంపై విధానం రూపొందించేలా ఆదేశాలు ఇవ్వాలని సదరు పిటిషన్‌ను దాఖలు చేసిన వ్యక్తి కోర్టును కోరారు. ఈ పిటిషన్ సోమవారం జస్టిస్ లలిత్ ధర్మాసనం ముందుకు రాగా... ఇది సుప్రీంకోర్టు పరిధిలోకి రాదని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేశారు.