Balakrishna: కృష్ణంరాజుతో కలిసి రెండు సినిమాల్లో నటించా.. గొప్ప అనుభవం అది: బాలకృష్ణ

Balakrishna Remembers his relation with Krishnam Raju
  • కృష్ణంరాజు మృతి తనను తీవ్రంగా కలచివేసిందన్న బాలకృష్ణ
  • ఆయనతో తన కుటుంబానికి మంచి అనుబంధం ఉందని గుర్తు చేసుకున్న బాలయ్య
  • ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి
సీనియర్ నటుడు కృష్ణంరాజు మృతి తనను తీవ్రంగా కలచివేసిందని ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సినీ, రాజకీయ రంగాలలో ఆయనది చెరగని ముద్ర అని కొనియాడారు. విలక్షణ నటనతో ప్రేక్షకుల గుండెల్లో రెబల్ స్టార్‌గా స్థానం సంపాదించుకున్నారని ప్రశంసించారు. కృష్ణంరాజుతో కలిసి రెండు సినిమాల్లో తాను నటించానని గుర్తు చేసుకున్న బాలయ్య.. అది తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప అనుభవమని అన్నారు. 

ఆయనతో తన కుటుంబానికి మంచి అనుబంధం ఉందన్నారు. కృష్ణంరాజు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు తాను అక్కడికి వెళ్లి కలిశానని గుర్తు చేసుకున్నారు. ఆయనీ రోజు మన మధ్య లేకపోవడం దురదృష్టకరమన్న బాలకృష్ణ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నట్టు పేర్కొన్నారు.
Balakrishna
Krishnam Raju
Tollywood
TDP

More Telugu News