Venkaiah Naidu: కృష్ణంరాజుకు వెంకయ్యనాయుడు, కేటీఆర్ ఘన నివాళి

Venkaiah Naidu and KTR pays tributes to Krishnam Raju
  • కృష్ణంరాజు మంచి తనానికి మారు పేరు అన్న వెంకయ్యనాయుడు
  • కృష్ణంరాజు మరణవార్త బాధకు గురి చేసిందన్న కేటీఆర్
  • ప్రభాస్ కు సంతాపాన్ని తెలియజేస్తున్నానని ట్వీట్
ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఆయనకు ఘన నివాళి అర్పించారు. కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ చలనచిత్ర నటులు శ్రీ ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు గారు పరమపదించడం అత్యంత విచారకరమని వెంకయ్య ట్వీట్ చేశారు. మంచి తనానికి మారు పేరుగా అనేక మంది అభిమానాన్ని చూరగొన్న వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు.  

కృష్ణంరాజు గారి మరణ వార్త ఎంతో బాధకు గురి చేసిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అత్యంత పాప్యులర్ స్టార్లలో రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు ఒక్కరని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు, ప్రభాస్ కు, స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నానని అన్నారు.
Venkaiah Naidu
KTR
TRS
Krishnama Raju
Tollywood

More Telugu News